Home Political News ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడ‌డండి… కేసీఆర్ హెచ్చ‌రిక..!

ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడ‌డండి… కేసీఆర్ హెచ్చ‌రిక..!

83
0

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారంలో మ‌రింత స్పీడు పెంచింది. తెలంగాణ భ‌వ‌న్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్ధుల‌తో కేసీఆర్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పాక్షిక మ్యానిఫెస్టోను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం గురించి అభ్య‌ర్ధులకు దిశానిర్ధేశం చేసారు. ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ది పొందిన వారి జాబితాను నియోజ‌క‌వ‌ర్గాల వారిగా అభ్య‌ర్ధుల‌కు అంద‌చేసారు. నెలాఖ‌రులోగా ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలియ‌చేసారు.  ఉమ్మ‌డి జిల్లాల కేంద్రాల్లో స‌భ‌ల బాధ్య‌త‌లను కేసీఆర్ రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావుకు అప్ప‌గించారు.

గ్రేట‌ర్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాలన్నింటినీ క‌లిపి ఓ భారీ బ‌హిరంగ స‌భ‌ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌భ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ కు అప్ప‌గించిన‌ట్టు కేసీఆర్ చెప్పారు.  ఈ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో కేసీఆర్ అభ్య‌ర్ధుల‌కు గ‌ట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ప్ర‌జ‌ల్లో ఉన్న‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాలని… కోడ్ అమ‌లులో ఉంది జాగ్ర‌త్త అంటూ కేసీఆర్ హెచ్చ‌రించారు. ప్ర‌చారం పై నిర్ల‌క్ష్యం చూప‌ద్దు అని చెప్పారు. అభ్య‌ర్ధులు 5 నుంచి 10 శాతం మెరుగుప‌డాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here