Home Actor ఓంకార్ రాజు గారి గ‌ది 3 ప్రారంభం..!

ఓంకార్ రాజు గారి గ‌ది 3 ప్రారంభం..!

68
0
ఓంకార్ రాజు గారి గ‌ది 3 ప్రారంభం..! spiceandhra

జీనియ‌స్ సినిమాతో డైరెక్ట‌ర్ గా మారిన‌ యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. ఆత‌ర్వాత ఓంకార్ తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది. 2015లో రిలీజైన ఈ సినిమాలో అశ్విన్ బాబు, ధ‌న్య‌బాల‌క్రిష్ట‌న్, ధ‌న‌రాజ్, రాజీవ్ క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. హ‌ర్ర‌ర్ కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్నిసాధించింది. ఆత‌ర్వాత ఈ క‌థ‌కు సంబంధం లేక‌పోయినా రాజు గారి గ‌ది 2 టైటిల్ తో ఓంకార్ మ‌రో సినిమా తెర‌కెక్కించారు. ఇందులో నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్, ఓఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. 2017లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజు గారి గ‌ది 2 ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చి ఓంకార్ టీవీ షోలో బిజీ అయ్యారు. తాజాగా ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమాని ప్రారంభించారు.

 మిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో రాజు గారి గ‌ది 3 చిత్రం ఈరోజు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైంది. ముహ‌ర్త‌పు స‌న్నివేశానికి దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విభిన్నమైన కథా, కథనాలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ సాగుతుందని ఓంకార్ తెలియ‌చేసారు. తమన్నా జోడీగా అశ్విన్ బాబు కనిపించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here