Home Political News ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్ర‌బాబు – కేసీఆర్

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్ర‌బాబు – కేసీఆర్

87
0

నిజామాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మ‌హా కూట‌మి పై ఫైర్ అయ్యారు. ఈ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ…ఈరోజు చూసిన జ‌న‌ప్ర‌భంజ‌నం ఏనాడూ చూడ‌లేదు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ బావుటా ఎగ‌ర‌వేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా.  గ‌త ఎన్నిక‌ల్లో 9 శాస‌న‌స‌భ‌, 2 ఎంపీ స్ధానాల్లో తెరాస అభ్య‌ర్ధుల‌ను గెలిపించారని గుర్తు చేసారు.  నిజాం సాగ‌ర్ కు ఒక టీఎంసీ నీళ్లు కావాల‌ని పోచారం కోరారు. అధికారం చేప‌ట్టే నాటికి రాష్ట్రంలో అన్నీ సంక్షోభాలే. తెలంగాణ‌లో ప్ర‌తీ ఎక‌రానికి సాగు నీరు..ప్ర‌తి ఇంటికి తాగు నీరు అందించ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

చంద్ర‌బాబు తెలంగాణ ద్రోహి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్ర‌బాబు. టీడీపీతో పొత్త పెట్టుకున్న కాంగ్రెస్ నేత‌ల‌వి ఏం బ‌తుకులు..?   సిగ్గులేకుండా టీడీపీతో కాంగ్రెస్ నాయ‌కులు చేతులు క‌లుపుతారా..? ఒంటికి పోవాల‌న్నా, రెంటికి పోవాల‌న్నా, ఢిల్లీకి పోవాలి. కాంగ్రెస్ గులాంగిరీ మ‌న‌స్తత్వానికి ఇది ప‌రాకాష్ట అన్నారు. ప్ర‌తీ అకౌంట్ లో 15 ల‌క్ష‌లు వేస్తామ‌న్న బీజేపీ మాట ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి అబ‌ద్దాల కోరు అని పీసీసీ చీఫ్ అన్నాడు. ఎవ‌రు అబ‌ద్దాల కోరే ప్ర‌జ‌లే చెప్పాలి. గౌర‌వ‌మైన హోదాలో ఉన్నాను కాబ‌ట్టి నోరు గ‌ట్టుకున్నా అన్నారు.

ప్ర‌తి అభివృద్ది ప‌ధ‌కాన్ని అడ్డుకుంటూ కేసులు వేస్తున్నారు. ఒక్క కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పైనే 196 కేసులు వేసారు. చిల్ల‌ర రాజ‌కీయాలు..అధికారం కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ది కోస‌మే 9 నెల‌ల అధికారాన్ని త్యాగం చేసామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here