Home Political News ఓటు న‌మోదుకు ప‌వ‌న్ పిలుపు..!

ఓటు న‌మోదుకు ప‌వ‌న్ పిలుపు..!

102
0

మ‌న దేశం బాగుండాలి అంటే..ప్ర‌భుత్వం స‌మ‌ర్ధంతంగా ప‌ని చేయాలి. అలా చేయాలంటే..స‌మ‌ర్ధ‌త ఉన్న నాయ‌కుల‌ను ఎన్నుకోవాలి. నాయ‌కుల‌ను ఎన్నుకోవాలంటే ఓటు వెయ్యాలి. మ‌రి..ఓటు వేయాలంటే ఓటు హ‌క్కు ఉండాలి. అందుచేత 18 సంవ‌త్స‌రాలు నిండిన వాళ్లు ఓటరుగా న‌మోదు చేసుకోవాలి. అక్టోబ‌ర్ 31 ఓటు న‌మోదు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  స్పందిస్తూ…ఓటు హ‌క్కును అంద‌రు వినియోగించుకోవాలి.

ఓటు న‌మోదు చేసుకున్న వారు..న‌మోదు చేసుకోని వారిని ప్ర‌భావితం చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపు ఇచ్చారు. ఓటు న‌మోదు చేసుకుని ప్ర‌తి ఒక్క‌రు ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌చారం చేస్తున్నారు. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఎంత‌లా ప్ర‌చారం చేసినా ఓటు హ‌క్కును మాత్రం అంద‌రూ వినియోగించుకోవ‌డం లేదు. ఓటు వేయ‌క‌పోతే మ‌న నాయ‌కుల‌ను ప్ర‌శ్నించే హ‌క్కు కోల్పోయిన‌ట్టే. అందుచేత ఓటు న‌మోదు చేసుకోని వారు ఈ నెల 31 లోపు న‌మోదు చేసుకోండి. ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకుని స‌రైనా నాయ‌కుడిని ఎన్నుకోండి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here