Home Political News ఓట్లు తొల‌గింపుకు ప్ర‌భుత్వానికి, పార్టీకి సంబంధం ఏంటి..? – త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్

ఓట్లు తొల‌గింపుకు ప్ర‌భుత్వానికి, పార్టీకి సంబంధం ఏంటి..? – త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్

98
0
talasani

కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ల‌క్ష అర‌వై వేల ఓట్లు తొలగించార‌ని..తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆరోపించారు. అంతే కాకుండా..తొల‌గించిన ఓట‌ర్ల పేర్ల‌ను వెంట‌నే ఓట‌ర్ లిస్ట్ లో చేర్చాలంటూ ఇటీవ‌ల ముసాపేట‌ మున్సిప‌ల్ ఆఫీస్ ఎదుట తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులు ధ‌ర్నా నిర్వ‌హించారు. కూక‌ట్ ప‌ల్లిలోనే కాకుండా హైద‌రాబాద్ లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు గ‌ల్లంతు అయ్యాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ స్పందిస్తూ..ఓటు హ‌క్కు ఉందో లేదో చూసుకునే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంది. ఓట్లు తొల‌గించార‌నే అనుమానం ఉంటే..నేరుగా ఈసీని సంప్ర‌దించాలి అన్నారు. అస‌లు..ఓట్లు విష‌యంలో ప్ర‌భుత్వానికి, పార్టీకి సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ఓట్ల‌ను ఎందుకు తొల‌గిస్తారు.?  ఎవ‌రు ఏ పార్టీకి ఓటు వేస్తారో ఎలా తెలుస్తుంది.?  20 రోజుల నుంచి ఓట్ల న‌మోదు కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. మ‌రో 5 రోజులు ఓటు న‌మోదు కార్య‌క్ర‌మానికి అవ‌కాశం ఉంది.ఎవ‌రికైనా ఓట్లు విష‌యంలో అనుమానాలున్నా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు అన్నారు.  అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ఓట్ల జాబితా వెళుతుంది. ప్ర‌తి జిల్లాలో ఓట్ల జాబితా అందుబాటులో ఉంటుంద‌ని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here