Home Actor ఓట్ల కోసం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలా అబద్ధాలు చెప్పను – ప‌వన్ క‌ళ్యాణ్

ఓట్ల కోసం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలా అబద్ధాలు చెప్పను – ప‌వన్ క‌ళ్యాణ్

103
0

•          రాష్ట్ర బడ్జెట్ తో పొంతన లేకుండా హామీలు గుప్పిస్తున్నారు

•       జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవు

•          మార్పు తీసుకొచ్చే బలమైన సంకల్పం జనసేన సొంతం

•          కర్నూలు జిల్లావాసులు కుటుంబ రాజకీయాల కబంద హస్తాల్లో నలిగిపోతున్నారు

•          నేతల కుటుంబాలు బాగుపడుతున్నాయి… సామాన్య యువత నిరుద్యోగులవుతున్నారు

•          కర్నూలు బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

జ‌న‌సేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ఉండ‌వ‌ని, ఒకే వ్య‌క్తికి అధికారం ఇస్తే పాల‌న అస్త‌వ్య‌స్తంగా త‌యార‌వుతుంద‌ని, అందుకే సంకీర్ణ ప్ర‌భుత్వాలు వైపు దృష్టి పెట్టాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు. రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తాన‌ని చెప్పను కానీ…  ప్ర‌తి కులాన్ని, మ‌తాన్ని గౌర‌వించే ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తాన‌ని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టో గురించి చెబుదాం అనుకుంటే సిగ్గేస్తుంద‌ని అన్నారు. మ‌న బ‌డ్జెట్ రెండు ల‌క్ష‌ల కోట్లు ఉంటే అధికార‌, ప్ర‌తి ప‌క్షాలు నాలుగైదు ల‌క్ష‌ల కోట్ల రూపాయల మేర హామీలు ఇస్తున్నాయి.  ఓట్లు కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలా దిగ‌జారి అబద్దాలు చెప్ప‌లేను. పాతికేళ్లు ప్ర‌జ‌ల‌తోనే ఉంటూ, ప్ర‌జ‌ల‌తోనే న‌డుస్తూ అవినీతి కోట‌ల్ని బ‌ద్ద‌లు కొట్టి తీరుతామ‌న్నారు. ఆదివారం క‌ర్నూలు న‌గ‌రంలోని కొండారెడ్డి బురుజు దగ్గర నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ బురుజుకి అన్నివైపులా ఇసుక వేస్తే రాలనంతగా జన ప్రవాహం కనిపించింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగిస్తూ.. “క‌ర్నూలు జిల్లా అంటే  ప్ర‌త్యేకమైన అభిమానం. ముఖ్యంగా కొండా రెడ్డి బురుజు సెంట‌ర్ అంటే గుర్తొచ్చేది ఒక పోరాటయోధుని ధీరత్వం. అన్యాయం పై తిర‌గ‌బ‌డ్డ ఆ యోధుని గురించి చెప్పే బురుజు ఇది. దుర్మార్గుల‌ను ఎదుర్కొన్న కొండారెడ్డి పోరాటపటిమ బురుజు ఇది.  ఇలాంటి చారిత్రిక‌త బురుజు విదేశాల్లో ఉన్న‌ట్లయితే ప్ర‌పంచ‌మంతా తెలిసే ప‌ర్యాట‌క కేంద్రం అయ్యేది. కానీ మ‌న‌ పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల మ‌న దేశంలోనే చాలా మందికి తెలియ‌కుండా పోయింది. కర్నూలు జిల్లా ఉయ్యాల‌వాడ నరసింహా రెడ్డి గొప్పతనానికి.. బ్రిటిషర్ల నుంచి మనకు స్వేచ్ఛ ప్రసాదించేందుకు పోరాడిన ఆయన సాహసానికి కేంద్రం. సూర్యుడు అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయ‌న గ‌డ‌గ‌డ‌లాడించాడు. సుస్వాగ‌తం సినిమా ఫంక్ష‌న్ కి క‌ర్నూలు వ‌చ్చినప్పుడు నా కోసం వ‌చ్చిన అసంఖ్యాకమైన జ‌న సందోహంతో రోడ్లు కిట‌కిట‌లాడాయి. ఆ రోజు భ‌గ‌వంతుడికి ఒక‌టే నివేదించాను. ఇంత అభిమాన బ‌లం దేశ‌, స‌మాజ శ్రేయ‌స్సు కోసం ఉప‌యోగిస్తే నా జ‌న్మ ధ‌న్య‌మైన‌ట్లే అనుకున్నాను.  ఆ రోజు కోరిక ఈ రోజు జ‌న‌సేనానిగా నన్ను కొండారెడ్డి బురుజు ముందు నిల‌బెట్టింది అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here