Home Actor ఓ..బేబి ఆలోచింప చేసే సినిమా. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంది. – స‌మంత‌

ఓ..బేబి ఆలోచింప చేసే సినిమా. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంది. – స‌మంత‌

154
0
ఓ..బేబి అంద‌రినీ ఆలోచింప చేసే సినిమా ఇది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంది. - స‌మంత‌ spiceandhra

స‌మంత అక్కినేని – నందినీ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ఓ..బేబి. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ  క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 5న  ఓ..బేబి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా స‌మంత,  ఓ..బేబి చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు.

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ

స‌మంత చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ….ఓ బేబి నా కెరీర్ చాలా స్పెష‌ల్ మూవీ. ఈ క‌థ నాకు చాలా బాగా న‌చ్చింది. అందుక‌నే ఈ సినిమాని చాలా మందికి చూపించాల‌నుకుంటున్నాను. అందుక‌నే ఈ సినిమా విష‌యంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. మ‌హేష్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ న‌టించిన సినిమాల‌కైతే.. థియేట‌ర్స్ కు ఆటోమేటిగ్గా ఆడియ‌న్స్ వ‌చ్చేస్తారు. ఎంత అమ్మాయి స్టార్ హీరోయిన్ అయినప్ప‌టికీ… థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ర‌ప్పించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందుకే నా వంతుగా నేను విప‌రీతంగా ప‌బ్లిసీటీ చేస్తున్నాను.  థియేట‌ర్‌కు వ‌చ్చిన వారికి మాత్రం ఈ సినిమా ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంద‌రికీ న‌చ్చింది. దీంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఆ..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉంటుంది.

ఇది మామూలు రీమేక్ కాదు..

మామూలుగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అన‌గానే… థ్రిల్ల‌ర్ లేక‌ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలా ఉంటాయి. కానీ.. ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటూ… మ‌న‌సుకూ హ‌త్తుకునేలా ఉంటుంది. అందుకనే ఈ సినిమా నాకు స్పెష‌ల్‌. కామెడీ, సెంటిమెంట్…ఇలా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అన్నీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమా కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. అయితే..రీమేక్ అంటే ఏదో రైట్స్ తీసుకుని సినిమా చేసేయ‌డంలా కాకుండా…మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేసాం. అంతే కాకుండా..తెలుగు సినిమాకు కూడా మిస్ గ్రానీ చిత్ర నిర్మాత‌లు నిర్మాణ భాగ‌స్వామ్యం తీసుకున్నారు. అందుచేత వాళ్లు  ప్ర‌తి స‌న్నివేశం ఎందుకు పెట్టారో తెలుసుకుని ప్రాప‌ర్‌గా రీమేక్ చేశాం.

ఆయ నుంచి చాలా నేర్చుకున్నాను

కామెడీ రిథ‌మ్ తెలియ‌దు. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారి ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాను. ఆయ‌న‌తో చేసిన సీన్స్ అన్నీ ఓ లెవ‌ల్లో ఉంటాయి. చిన్న వ‌య‌సులో ఉండి పెద్ద త‌ర‌హా క్యారెక్ట‌ర్ లా న‌టించాలంటే నాకు ఛాలెంజ్. పైగా నాకు నాన్న‌మ్మ‌, అమ్మ‌మ్మ‌లతో పెరిగిన జ్ఞాప‌కాలు లేవు. అందుచేత ఈ క్యారెక్టర్ కోస‌మ‌ని… కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌ల‌కు వెళ్లాను. వాళ్ల‌తో టైమ్ స్పెండ్ చేసాను. వ‌య‌సు పెరిగే కొద్దీ వారు చిన్న‌పిల్ల‌లై పోవ‌డాన్ని గ‌మ‌నించాను. అది నాకు బాగా హెల్ప్ అయింది.

..సీన్ కోసం చాలా ష్టడ్డాను.

ఈ సినిమా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే…చాలా క‌ష్ట‌ప‌డి చేసాను. నేను ఎమోష‌న‌ల్ సీన్స్ ని చాలా ఈజీగా చేసేస్తాననే ధీమా ఉండేది. అయితే..ఆరోజు ఎందుక‌నో ఎంత ప్ర‌య‌త్నించినా నాకు ఏడుపు రాలేదు. అందుచేత రెండు గంట‌లు బ్రేక్ తీసుకుని ఏడుపు తెచ్చుకుని ఆ సీన్ చేసాను. నా కెరీర్ లో ఇంత‌లా బ్రేక్ తీసుకుని చేసిన సీన్ ఇదే.   సినిమా చూసిన వాళ్లంద‌రికీ విప‌రీతంగా న‌చ్చుతుంది. వాళ్ల పేరెంట్స్, అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ‌లు గుర్తొస్తారు. అంద‌రినీ ఆలోచింప చేసే సినిమా ఇది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంది అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here