Home Actor ఓ..బేబి కోసం.. తిరుమ‌ల‌లో స‌మంత‌.

ఓ..బేబి కోసం.. తిరుమ‌ల‌లో స‌మంత‌.

61
0
ఓ..బేబి కోసం తిరుమ‌ల‌లో స‌మంత‌. spiceandhra

స‌మంత అక్కినేని – నందినీ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ఓ..బేబి. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా అంద‌ర్నీ ఆలోచింప చేసే క‌థాంశంతో ఈ సినిమా రూపొంద‌డం..ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఓ..బేబి పై పాజిటివ్ టాక్ ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై అంచ‌నాలు రెట్టింపు చేసింది.

ఈ నెల 5న ఓ..బేబి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున చిత్ర ద‌ర్శకురాలు నందినీరెడ్డితో కలిసి ఆమె తిరుమలకు రాగా, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం స్వామి వారి సేవలో సమంత, నందినీ రెడ్డి పాల్గొన్నారు.

ద‌ర్శనానంతరం స‌మంత‌ ఆలయం వెలుపలికి రాగా, భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, దగ్గర నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. స‌మంత స్పందిస్తూ…తన కొత్త చిత్రం ఓ బేబి విజ‌యం సాధించాల‌ని స్వామిని మొక్కుకున్నట్టు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here