Home Actor ఓ..బేబి చిత్రం పై గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల ప్ర‌శంస‌లు..!

ఓ..బేబి చిత్రం పై గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల ప్ర‌శంస‌లు..!

20
0
ఓ..బేబికి గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల ప్ర‌శంస‌లు..! spiceandhra

స‌మంత తాజా చిత్రం ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్ని సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉంటే… సినీ ప్ర‌ముఖులు, సినీ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న ఓ.. బేబి చిత్రం పై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్ లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తుల కోసం ఓ.. బేబి చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ మూవీని చూసిన అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి, చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, కో – ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిభొట్లను న‌ర‌సింహ‌న్ దంప‌తులు ప్ర‌త్యేకంగా అభినందిం చారు. అంతే కాకుండా.. మంచి సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించారు అంటూ ఓ.. బేబి టీమ్ మొత్తాన్ని ఎంత‌గానో అభినందించారు.

ఇదిలా ఉంటే… తెలుగులో స‌క్స‌స్ సాధించిన ఈ సినిమాని త‌మిళ్, మ‌ల‌యాళంలో డ‌బ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here