Home Actor ఓ బేబి రివ్యూ.

ఓ బేబి రివ్యూ.

280
0
ఓ బేబి రివ్యూ..! spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన తాజా చిత్రం ఓ..బేబి. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ ఇది. ఈ మూవీ ఏడో రీమేక్. ఇప్ప‌టి వ‌ర‌కు రీమేక్ చేసిన అన్ని భాష‌ల్లో ఈ సినిమా స‌క్స‌స్ సాధించ‌డంతో తెలుగులో కూడా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఫ‌స్ట్ నుంచి ఏర్ప‌డింది. దీనికి తోడు ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం…70  ఏళ్ల బామ్మ‌ 20 ఏళ్ల అమ్మాయిగా మార‌డం అనేది ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో ఓ బేబి చిత్రం పై ఆడియ‌న్స్ లో ఆస‌క్తి ఏర్ప‌డింది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ  క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ రోజు అన‌గా జులై 5న ఓ..బేబి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి.. బేబి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – 70 ఏళ్ల బామ్మ సావిత్రి (ల‌క్ష్మీ).  త‌న కొడుకు (రావు ర‌మేష్‌) పై ప్రేమ‌తో.. త‌న చాద‌స్తంతో ఇంట్లో వాళ్ల‌ని ఇబ్బంది పెడుతుంటుంది. ఆమె ప‌నుల వ‌ల్ల కోడ‌లు టెన్ష‌న్ ఫీలై హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. డాక్ట‌ర్స్ అత్త, కోడ‌లు దూరంగా ఉంటే బాగుంటుంది అని చెబుతారు. బామ్మ‌ను వృద్ధాశ్ర‌మంలో చేరిస్తే మంచిద‌ని స‌ల‌హా కూడా ఇస్తారు. ఈ విష‌యం త‌ల్లికి చెప్ప‌లేక‌.. అలాగ‌ని భార్య బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక కొడుకు స‌త‌మ‌త‌మౌతుంటే మ‌న‌వరాలు అస‌లు విష‌యం బామ్మ‌కి చెబుతుంది.

అంతే.. బామ్మ బాధ‌తో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. త‌న జీవితంలో అనుకున్న ఏదీ జ‌ర‌గ‌లేద‌ని..దేవుడి త‌న‌కే ఎందుకు ఇలా చేసాడ‌ని బాధ‌ప‌డుతుంటుంది. అయితే.. ఆమె మ‌న‌వ‌డు సింగ‌ర్ అవ్వాల‌నుకుంటాడు. అత‌ను ఓ పొగ్రామ్ లో  పాట పాడుతున్నాను ర‌మ్మ‌ని బామ్మ‌ని పిలుస్తాడు… కాద‌న‌లేక వెళుతుంటే.. ఓ ఫోటో స్టూడియో క‌నిపిస్తుంది. ఎప్ప‌టి నుంచో మంచి ఫోటో తీయించుకోవాల‌ని బామ్మ‌ కోరిక‌.

వెళ్లి ఫోటో తీయించుకుంటుంది. ఊహించ‌ని విధంగా ఆ 70 ఏళ్ల బామ్మ కాస్త 20 ఏళ్ల బేబి అవుతుంది. ఎలా మారింది..?  బేబిగా మారిన త‌ర్వాత ఆమెకు ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంటి..?  ఈ విష‌యం తెలిసి ఫ్యామ‌లీ మెంబ‌ర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు..?  చివ‌రికి బేబి కాస్త బామ్మ అయ్యిందా..? లేక అలాగే ఉందా..? అస‌లు ఏం జ‌రిగింది అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – స‌మంత‌…పైకి 20 ఏళ్ల బేబిగా క‌నిపించినా.. లోప‌ల మాత్రం70 ఏళ్ల బామ్మగా ఉండే డిఫ‌రెంట్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. రాజ‌మండ్రికి చెందిన సావిత్రి పాత్ర‌లో స‌మంత‌ గోదావ‌రి యాస‌లో మాట్లాడుతూ… ఓసారి న‌వ్విస్తూ.. ఓసారి ఏడిపిస్తూ… ఓసారి ఆలోచింప చేస్తూ…అద‌ర‌గొట్టేసింది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ పాత్ర స్వ‌భావాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని సూప‌ర్ గా న‌టించారు.

స‌మంత‌, ల‌క్ష్మీ మాత్ర‌మే కాదు..కొడుకు పాత్ర‌లో రావు ర‌మేష్, కోడ‌లు పాత్ర‌లో ప్ర‌గ‌తి,  ఫ్రెండ్ పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్, హీరో నాగ‌శౌర్య‌, మ‌న‌వ‌డు పాత్ర‌లో తేజ‌.. గెస్ట్ రోల్స్ లో జ‌గ‌ప‌తిబాబు, అడ‌వి శేష్ .. ఇలా అంద‌రూ ప‌ర్ ఫెక్ట్ అనేలా అద్భుతంగా న‌టించారు. ఇక సినిమాని ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. రాజేంద్ర‌ప్ర‌సాద్, స‌మంత మ‌ధ్య వ‌చ్చే సీన్స్ క‌డుపుబ్బా న‌విస్తాయి. 

 అప్పుడే ఇంట‌ర్వెల్లా..అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ఎంట‌ర్ టైన్మెంట్ తో పాటు ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. క్లైమాక్స్ సీన్స్ లో రావు ర‌మేష్, స‌మంతల న‌ట‌న కంట‌త‌డిపెట్టిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి. డైలాగ్ రైట‌ర్ ల‌క్ష్మీ భూపాల చాలా క‌ష్ట‌ప‌డి కాదు… చాలా ఇష్ట‌ప‌డి ఈ సినిమాకి సంభాష‌ణ‌లు అందించారు. అందుక‌నే..గోదావ‌రి జిల్లాలో ఉండే ఆ..మ‌మ‌కారం,ఆ.. వెట‌కారం అన్నింటినీ డైలాగుల్లో చూపించారు. మిక్కి జే మేయ‌ర్ సంగీతం, పాట‌లు బాగున్నాయి.

కొరియ‌న్ మూవీ రైట్స్ తీసేసుకుని..ఏదో తీసేసి బిజినెస్ చేసేసుకుందాం అన్న‌ట్టు కాకుండా… మంచి సినిమాని వీలైనంత ఎక్కుమందికి చూపించాలి అనే స‌దుద్ధేశ్యంతో ఈ  క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ ప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా..ఈ సినిమాకి ఏమేం కావాలో అవ‌న్నీ స‌మ‌కూర్చి మంచి సినిమాని అందించారు. ఈ సినిమా చివ‌రిలో వ‌చ్చే స‌ర్ ఫ్రైజ్ బాగుంది. అది ఏంటి అని చెప్ప‌డం కంటే చూస్తే బాగుంటుది. ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే… అంద‌రికీ న‌చ్చే మంచి సినిమా.

రేటింగ్ – 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here