Home Actor ఓ బేబీ..ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖ‌రారు.!

ఓ బేబీ..ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖ‌రారు.!

60
0
ఓ బేబీ..ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖ‌రారు.! spiceandhra

సమంత అక్కినేని – నందినీ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ఓ..బేబీ. కొరియ‌న్ ఫిల్మ్  మిస్ గ్రానీ సినిమాకి రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన‌ ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మి, నటులు రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, తేజ సజ్జ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని జులై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా  ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను రేపు అన‌గా ఈ నెల 29న  హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో చిత్ర యూనిట్ సభ్యులు మరియు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియ‌చేసారు.  యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here