Home Actor ఓ..బేబీ (స‌మంత‌) లుక్ అదిరింది..!

ఓ..బేబీ (స‌మంత‌) లుక్ అదిరింది..!

96
0


క‌థానాయిక స‌మంత, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం ఓ.. బేబీ. ఈ సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ..అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఈరోజు ఈ మూవీ గురించి స‌మంత స్పందిస్తూ…ఓ..బేబీ టైటిల్ ఖ‌రారు చేసారు. అంతే కాకుండా త‌న పాత్ర‌కు సంబంధించిన ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోల‌కు సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.

టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సంద‌ర్భంగా స‌మంత స్పందిస్తూ…నా మార్గాన్ని ఎంచుకోవ‌డానికి దేవుడు, నా చుట్టూ ఉన్న వాళ్లు ఎంత‌గానో స‌హ‌క‌రించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప‌ర్స‌న‌ల్ గా, ఫ్రొఫెష‌న‌ల్ గా ఎద‌గ‌డానికి కొంచెం టైమ్ తీసుకున్నాను. ఈ క్ర‌మంలో ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను ఎదుర్కొన్నాను కానీ..ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. ఓ బేబీ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్. నా ప్రియ‌మైన డైరెక్ట‌ర్ నందిని రెడ్డి ఎంతో ఇష్ట‌మైన క్యారెక్ట‌ర్ ఇచ్చారు అంటూ సంతోషం వ్య‌క్తం చేసారు.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here