Home Actor కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఫ‌స్ట్ సాంగ్ రెడీ – రామ్ గోపాల్ వ‌ర్మ‌

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఫ‌స్ట్ సాంగ్ రెడీ – రామ్ గోపాల్ వ‌ర్మ‌

126
0
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఫ‌స్ట్ సాంగ్ రెడీ - రామ్ గోపాల్ వ‌ర్మ‌ spiceandhra

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజ‌య‌వాడ వెళ్లిన‌ప్పుడు క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే సినిమా తీయాల‌నిపిస్తుంది అని ఎనౌన్స్ చేసారు. ఆత‌ర్వాత మ‌ళ్లీ ఆ సినిమా గురించి వ‌ర్మ మాట్లాడ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ని ఎవ‌రు అంత సీరియ‌స్ గా తీసుకోలేదు.

అయితే… ఈ రోజు తన తాజా చిత్రం గురించి లేటెస్ట్ అప్ డేట్ ను అభిమానులకు అందించారు వ‌ర్మ‌. కొత్త చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.  తొలి సాంగ్ ట్రయిలర్ రేపు అన‌గా ఈ నెల 9న‌ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్శియల్ చిత్రంగా వర్మ పేర్కొనడం గమనార్హం.

ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నార‌ట‌ వర్మ. అయితే.. ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎనౌన్స్ చేయ‌లేదు. మ‌రి.. ఈ సినిమాతో ఎలాంటి వివాదాలు సృష్టించ‌నున్నారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here