Home Political News కరవుపై కలిసి పోరాడుదాం – సీపీఐ, సీపీఎం నేతలతో నాదెండ్ల మనోహర్.

కరవుపై కలిసి పోరాడుదాం – సీపీఐ, సీపీఎం నేతలతో నాదెండ్ల మనోహర్.

109
0

రాష్ట్రంలో నెలకొన్న క‌రవుపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించేలా చేప‌ట్టనున్న ఆందోళ‌న‌ల‌కి జ‌న‌సేన పార్టీ క‌ల‌సి వ‌స్తుంద‌ని జనసేన నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ గారు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్  ఆదేశాల మేరకు క‌రవు ప‌రిస్థితుల‌పై క్షేత్రస్థాయిలో అధ్య‌య‌నం చేసిన అనంత‌రం అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌కి రూప‌క‌ల్ప‌న చేద్దామ‌ని తెలిపారు. గురువారం విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో సిపిఐ, సిపిఎం, జ‌న‌సేన పార్టీ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు.

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలో నెల‌కొన్న క‌రవు ప‌రిస్థితులు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో తిత్లీ తుపాను కార‌ణంగా సంభ‌వించిన న‌ష్టంపై చ‌ర్చించారు. ఈ సందర్భంగా తిత్లీ తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  జ‌రిపిన ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను మ‌నోహ‌ర్ గారు క‌మ్యునిస్ట్ పార్టీల నేత‌లకి వివ‌రించారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న ఆరు రోజుల పాటు 45 గ్రామాల్లో, 700 కిలోమీట‌ర్ల మేర సాగిందనీ.35 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న తిరిగారనీ చెప్పారు. శుక్ర‌వారం నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి పోరాట యాత్ర మొద‌ల‌వుతుందని తెలిపారు. అనంత‌రం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తార‌ని తెలిపారు.

తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు జ‌న‌సేన పార్టీ త‌రుపున త‌క్ష‌ణ సాయంగా విద్యార్ధుల‌కి పాఠ్య పుస్త‌కాలు, మందులు, కొవ్వొత్తులు, ఆహార ప‌దార్ధాలు పంపిణీ చేసిన‌ట్టు శ్రీ మ‌నోహ‌ర్ గారు తెలిపారు.రాయ‌ల‌సీమ‌లో నెల‌కొన్న క‌రవు ప‌రిస్థితుల‌ని సిపిఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణ వివ‌రించారు. క‌రవు తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో తెలిపారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరందుతుంద‌న్న ఆశ‌తో ఉన్న సీమ ప్ర‌జ‌లు, అది అంద‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌తో ఉన్నార‌ని వెల్ల‌డించారు. నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో నెల‌కొన్న క‌రవు ప‌రిస్థితుల‌ను సిపిఎం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శి మ‌ధు వివ‌రించారు. రెండు జిల్లాలు ఎన్న‌డూ లేని విధంగా క‌రవు కోర‌ల్లో చిక్కుకున్నాయ‌ని చెప్పారు.

రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితుల నేపథ్యంలో  ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో ద‌ళితుల‌కి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని, వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మం చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మావేశంలో జ‌న‌సేన పార్టీ త‌రపున పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్ శ్రీ మాదాసు గంగాధ‌రం,రాజ‌కీయ కార్య‌ద‌ర్శి శ్రీ పి.హ‌రిప్ర‌సాద్‌, శ్రీ రాజు ర‌వితేజ‌,సిపిఐ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ ఓబులేశు, శ్రీ హ‌ర్‌నాథ్‌రెడ్డి, సిపిఎం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ మ‌ధు, శ్రీ జె.శ్రీనివాస్‌, శ్రీ వై.వి రావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here