Home Actor కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్న సినిమా..?

కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్న సినిమా..?

89
0

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రాన్ని చూసి, “చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు.” అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టీ ప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు.

జి వి ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : ఏ ఆర్ రహమాన్, సినిమాటోగ్రఫీ : రవి యాదవ్, ఆర్ట్ : సి ఎస్ ఆనందన్, లిరిక్స్ : రాకెందు మౌళి, డైలాగ్స్ : ఘంటసాల రత్న కుమార్, ఏక్షన్ : దినేష్ సుబ్బరాయ యన్,  ఎడిటింగ్ : అంతోని, నిర్మాత : లత, కథ, కథనం, దర్శకత్వం : రాజీవ్ మీనన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here