Home Political News కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ స‌మావేశం – 34 మంది అభ్యర్థులు ఖ‌రారు..!

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ స‌మావేశం – 34 మంది అభ్యర్థులు ఖ‌రారు..!

103
0

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల పేర్ల‌ను ఖ‌రారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు గండిపేట‌లోని గోల్కండ రిసార్ట్స్ లో స‌మావేశ‌మైంది. క‌మిటీ మెంబ‌ర్స్ చ‌ర్చ‌ల అనంత‌రం మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను కమిటీ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ 105 మందితో కూడిన భారీ జాబితాను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థల ఎంపిక పై కసరత్తును ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ లిస్ట్ ను రాహుల్ గాంధీకి పంప‌నున్నారు. ఎల్లుండి కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 12న యూపీఏ చైర్‌ పర్సన్ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థుల బలాబలాల పై చర్చించి ఐదు రాష్ట్రాల అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here