Home Political News కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ర‌ద్దు చేయాలి – రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు

కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ర‌ద్దు చేయాలి – రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు

96
0

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌కు మద్దతుగా నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్యుల సమ్మేళనం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి పోతుందని, టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళుతుందని, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)కి ఓటేస్తే ఎటూ గాకుండా పోతుందన్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే అభివృద్ధికి పట్టం కట్టినట్లవుతుందని చెప్పారు. బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌కుండా కాంగ్రెస్ అడ్డుకుంది. ప్రాజెక్టుల‌ను అడ్డుకుంది కాంగ్రెస్సే.  తాము గెలిస్తే రైతు బంధు, 24 గంట‌ల క‌రెంటు, క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ ను ప్ర‌జ‌లే ర‌ద్దు చేయాలి అన్నారు. అభివృద్ది నిరోధ‌క కాంగ్రెస్ కు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెప్పాలి. అన్ని పథకాలను రద్దు చేస్తాం. రద్దు చేస్తాం అంటున్న కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అని తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here