Home Political News కాంగ్రెస్, బిజెపీలు తీరని ద్రోహం చేశాయి – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

కాంగ్రెస్, బిజెపీలు తీరని ద్రోహం చేశాయి – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

113
0

చినరాజప్ప, యనమల, చంద్రబాబు, లోకేశ్, జగన్ లకు చెబుతున్నా… మీ పాపాలు పండాయి. నెల్లూరు జిల్లాలో వెంకయ్య స్వామి అని అవధూత ఉండేవారు. వారు రాసుకున్నారు.. ‘పాపాలు చేసినవారు చింతకాయల్లా రాలిపోతారు’ అని. ఆలాగే వీళ్ళ పాపాలు పండాయి… చింతకాయల్లా రాలిపోవడం ఖాయం అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.  ఈ దోపిడీకి, అవినీతిపరులకు అండగా ఉన్నవారు దీపావళి టపాసుల్లా పేలిపోతారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజీపీలు తీరని ద్రోహం చేశాయి. 2019 తరవాత దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు చూస్తారు. రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం రావడం ఖాయం. ఆడపడుచులు రాజకీయంగా ఎదిగేందుకు జనసేన చేదోడువాదోడుగా నిలుస్తుంది.

  • చెక్కుల మీద బాబు ఫోటోలా?

శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు పరిహారంగా చెక్కులు ఇస్తున్నారు. వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలు ఏమిటి? ఆయన ఏమైనా గాంధీ మహాత్ముడా. హెరిటేజ్ సొమ్ములో, తన ఆస్తినో ఇవ్వడం లేదు. ప్రజల సొమ్ము అది. ఆ సొమ్ము ఇస్తూ చెక్కుల మీద ఫోటోలు వేసుకోవడం ఏమిటి. కొంతలో కొంత సంతోషం ఏమిటంటే లోకేశ్ గారి ఫోటో వేయలేదు అన్నారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పులే మరోసారి చంద్రబాబు చేస్తున్నారు. 10ఏళ్ళు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా వదులుకున్నారు.

అభివృద్ధి అంతా ఒకే చోట చేస్తున్నారు. ఈ రోజు డాక్టర్స్ చెప్పారు ఎయిమ్స్ అనుమతించిన అన్ని ఆసుపత్రులనీ ఒకే చోట పెడుతున్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకి చేర్చాలి. జనసేన వచ్చాకా యువతకి ఉద్యోగావకాశాల కల్పన పై పూర్తి దృష్టిపెడుతుంది. చినరాజప్ప, లోకేశ్ లాంటివాళ్ళకి వందలు, వేల కోట్లు సంపాదించుకోవడం మీదే దృష్టి ఉంటుంది. యువతను పట్టించుకోరు.  అరకొర జీతాలు కాకుండా వారికి తగిన జీతాలు వచ్చేలా చేస్తుంది. దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలుస్తుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here