Home Actor కాంచ‌న 4 చిత్రానికి అంత బ‌డ్జెట్టా..?

కాంచ‌న 4 చిత్రానికి అంత బ‌డ్జెట్టా..?

101
0

రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కాంచ‌న 3. ఈ సినిమా తెలుగు, త‌మిళ్ లో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్ లో క‌లిపి 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ కాంచ‌న 4 చిత్రాన్ని వెంట‌నే స్టార్ట్ చేయ‌మ‌ని లారెన్స్ కి చెప్పార‌ట‌. అయితే…లారెన్స్ ప్ర‌స్తుతం హిందీలో కాంచ‌న చిత్రాన్ని అక్ష‌య్ కుమార్ తో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత కాంచ‌న 4 ప్రారంభిస్తాన‌ని లారెన్స్ చెప్పారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…కాంచన 4 సినిమాను నిర్మించడానికి సన్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చార‌ట‌. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి వాళ్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భారీ స్ధాయిలో గ్రాఫిక్స్ ఉప‌యోగించాల‌ని..భారీ తారాగ‌ణంతో ఈ సినిమా తీయాల‌ని అనుకోవ‌డం వ‌ల‌న ఇంత బ‌డ్జెట్ అవుతుంద‌ట‌. మ‌రి…ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here