Home Actor కాకినాడ‌లో బ‌న్నీ. ఇంత‌కీ ఏం చేయ‌నున్నాడు..?

కాకినాడ‌లో బ‌న్నీ. ఇంత‌కీ ఏం చేయ‌నున్నాడు..?

22
0
కాకినాడ‌లో బ‌న్నీ. ఇంత‌కీ ఏం చేయ‌నున్నాడు..? spiceandhra

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు కానీ..  నాన్న నేను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బ‌న్నీ స‌రస‌న‌ పూజా హేగ్డే న‌టిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ను కాకినాడ‌లో ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ తదితరులపై యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. కాకినాడ వీధుల్లోను .. బీచ్ లోను ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండు వారాల పాటు అక్కడ షూటింగ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రావు రమేశ్ ను అనుకున్న‌ప్ప‌టికీ.. కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ పాత్ర‌ను హర్షవర్ధన్ పోషిస్తున్నారు.

గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి  విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here