Home News కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ముఖ్యులు తెలుగుదేశం పార్టీలో చేరిక.

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ముఖ్యులు తెలుగుదేశం పార్టీలో చేరిక.

71
0

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోరు పెంచారు. పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అవుతూ..ఎన్నిక‌ల గురించి చ‌ర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే..2014లో కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చలమలశెట్టి సునీల్, పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడులను తెలుగుదేశం కండువా కప్పి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

కార్పొరేటర్లు కంపర రమేశ్, పాలక సూర్యకుమారి, రాజానగరం నుంచి పోటీ చేసిన ముత్యాల శ్రీనివాస్, కాకినాడ రూరల్ పోటీ చేసిన పి. సీతారామ్, బాడిగ శ్రీదేవి, జయరాజ్ కోరా తదితరులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో గన్నవరం ఏబీ కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here