Home Political News ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీ తాత‌, మీ నాన్న సొత్తా..? కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్య‌మంత్రి కాలేడ‌ని ప్ర‌శ్నించిన...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీ తాత‌, మీ నాన్న సొత్తా..? కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్య‌మంత్రి కాలేడ‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్..!

99
0

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన క‌వాతు పేరుతో ఇచ్చిన పిలుపుకు యువ‌త నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. క‌వాతుకు జ‌న‌సేన శ్రేణులు, యువ‌త, అభిమానులు భారీ స్ధాయిలో త‌ర‌లివ‌చ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజ్జేశ్వరం మీదుగా పవన్ కళ్యాణ్ పిచ్చుకలంక చేరుకుని..ఆత‌ర్వాత కవాతు ప్రారంభించారు. పిచ్చుకలంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు… గంటన్నర సేపు కవాతు నిర్వహించారు.

ఈ వేదిక పై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి లోకేశ్‌, వైసీపీ అధినేత జగన్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా తాత, నాన్న సీఎం అయ్యారు గనక నేనూ అవుతా అని లోకేశ్‌ అనుకున్నప్పుడు.. మా నాన్న సీఎం అయ్యారు గనక నేనూ అవుతా అని జగన్మోహన్‌ రెడ్డి ‌ అనుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్‌ కొడుకు ఈ రాష్ట్రానికి ఎందుకు సీఎం కాలేడు. కచ్చితంగా అవుతాడు అని చెప్పారు. చేయని తప్పులకు నెలలు నెలలు అనుమానాలు ఎదుర్కొన్నామని అన్నారు. తల్లిని దూషించుకున్నాం.. పౌరుషం లేదా మాకు… ఉప్పుకారం తినలేదా మేము…? పౌరుషాలు మీకేనా… ? మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినదించడంతో మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది అన్నారు ప‌వ‌న్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here