Home Political News కాబోయే సి.ఎం ఎవ‌రో చెప్పిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి..!

కాబోయే సి.ఎం ఎవ‌రో చెప్పిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి..!

83
0

ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింది. పార్టీల నేత‌లు ఎవ‌రి వ్యూహాల్లో వారు ఉన్నారు. టీఆర్ఎస్ కి దీటుగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌చారం ముమ్మ‌రం చేసారు. న‌ల్లొండ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ…రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరాభవం తప్పదని, టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని అన్నారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకం పెడతామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని… తండ్రి సీఎం, కొడుకు, అల్లుడు మంత్రులు, కుమార్తె ఎంపీ అయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని తెలిపారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో గెలిచిన అభ్య‌ర్ధే కాబోయే సీఎం అని తెలియ‌చేసారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం… టీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రం 60 ఏళ్లు వెన‌క్కిపోయింది. కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి పూర్వ‌వైభ‌వం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here