Home Movie News కామాక్షి మూవీస్ అధినేత, సీనియ‌ర్ నిర్మాత‌ డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఇక లేరు.!

కామాక్షి మూవీస్ అధినేత, సీనియ‌ర్ నిర్మాత‌ డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఇక లేరు.!

100
0

ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఈరోజు ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు. హృద‌య సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇటీవ‌ల ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేయించుకున్నారు. చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతూ ఈరోజు క‌న్నుమూసారు. ఆయ‌న 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్ స్ధాపించారు.

కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌డ‌, గ్రీకువీరుడు తదితర సినిమాల‌ను నిర్మించారు. నాగార్జున – శివ‌ప్ర‌సాద్ రెడ్డి మంచి స్నేహితులు. ఆయ‌న 15 సినిమాలు నిర్మిస్తే..అందులో 11 సినిమాలు నాగార్జున‌తో నిర్మిస్తే ఒక చిత్రాన్ని నాగ చైత‌న్య‌తో నిర్మించారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవచ్చు ఆయ‌న‌కు అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధం ఎలాంటిదో..! ఆయ‌న‌ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here