Home Actor కార్తి కొత్త సినిమా ప్రారంభం..!

కార్తి కొత్త సినిమా ప్రారంభం..!

111
0

కార్తి ఇటీవ‌ల న‌టించిన చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దేవ్ సినిమా ప్లాప్ అయిన‌ప్ప‌టి నుంచి క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. చాలా క‌థలు విని అందులో కొత్త‌గా..ఇంట్ర‌స్టింగ్ గా అనిపించిన‌ ముగ్గురు దర్శకులు చెప్పిన క‌థ‌ల‌కు కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట‌. లోకేష్‌ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఖైదీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివ‌రి దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత కార్తి దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించారు.

 ఈ సినిమా షూటింగు ఈ రోజు మొదలైంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న‌ ఈ సినిమాలో జ్యోతిక, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వయాకామ్ 18స్టూడియోస్ , పారలాల్ మైండ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ మూవీని అక్టోబర్లో విడుదల చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా తరువాత రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ప్రాజెక్టును కార్తీ పట్టాలెక్కించనున్నాడు. మ‌రి..ఈ మూడు చిత్రాలు కార్తికి ఆశించిన విజ‌యాన్ని అందిస్తాయ‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here