Home Telugu కీర్తి సురేష్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన గ్రేట్ డైరెక్ట‌ర్..!

కీర్తి సురేష్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన గ్రేట్ డైరెక్ట‌ర్..!

105
0

నేను..శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన మల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. తొలి సినిమాతోనే విజ‌యం సాధించిన కీర్తి సురేష్..ఆత‌ర్వాత నానితో క‌లిసి న‌టించిన నేను లోక‌ల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. ఇటీవ‌ల రిలీజైన మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌ను అద్భుతంగా పోషించి మెప్పించింది. సావిత్రి సినిమా కోసం పుడితే…కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించ‌డం కోస‌మే పుట్టింది అనేంతగా ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించింది.

మ‌హాన‌టి సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు చెప్పే మాట కీర్తి సురేష్ న‌ట‌న అద్భుతం. ఆమె న‌టించ‌లేదు..జీవించింది అంటూ ఆమె పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం కీర్తి సురేష్ ని అభినందిస్తూ… తాను చూసిన అత్యద్భుతమైన‌ పర్ఫామెన్స్ లలో ఇది ఒక‌ట‌ని… మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. దీంతో కీర్తి సురేష్ క్రేజ్ మ‌రింత పెరిగింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…రాజ‌మౌళి ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని అక్టోబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్ల‌నున్నార‌ని తెలిసింది. అయితే… ఎన్టీఆర్, చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. కీర్తి సురేష్ యాక్టింగ్ బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమా కోసం ఆమెను తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.  ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకా..?  లేక చ‌ర‌ణ్ కి జంట‌గా న‌టించేందుకా..?  అనేది తెలియాల్సివుంది. ఇదే క‌నుక నిజ‌మైతే…కీర్తి సురేష్ కి బంప‌ర్ ఆఫ‌రే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here