Home Actor కీర్తి సురేష్ మూవీకి టైటిల్ ఖ‌రారు..!

కీర్తి సురేష్ మూవీకి టైటిల్ ఖ‌రారు..!

115
0

మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన న‌టి కీర్తి సురేష్‌.  ప్ర‌స్తుతం కీర్తి సురేష్  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ చిత్రాన్ని 118 సినిమాని నిర్మించిన మ‌హేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. ప్ర‌జెంట్ ఐరోపాలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీకి స‌ఖి అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని సమాచారం. అయితే… టైటిల్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. క‌థ విష‌యానికి వ‌స్తే…స‌మాజంలో మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతున్నాయి. దీని వ‌ల్ల మ‌హిళ‌లు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి అనే క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. అంద‌ర్నీ ఆలోచింప చేసేలా ఈ సినిమాను ద‌ర్శ‌క‌డు న‌రేంద్ర తెర‌కెక్కిస్తున్నార‌ట‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here