Home Actor కీర్తి 20లో న‌టించేది ఎవ‌రో తెలుసా..?

కీర్తి 20లో న‌టించేది ఎవ‌రో తెలుసా..?

117
0


నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే విజ‌యం సాధించిన అందాల తార కీర్తి సురేష్. ఆత‌ర్వాత నేను లోక‌ల్, అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకున్నారు. మ‌హాన‌టి సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకున్న కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ ఉంది. మహానటి తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ .. తమిళంలో ఆమె వరుస సినిమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రాజేంద్ర‌ప్ర‌సాద్, సీనియర్ నరేష్, నదియా, కమల్ కామరాజు  భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. దీనికి సంబంధించిన స్పెష‌ల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. మరి కొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here