Home Political News కూక‌ట్ ప‌ల్లి నుంచి తెలుగుదేశం పార్టీ త‌రుపున పోటీ చేయ‌నున్న క‌ళ్యాణ్ రామ్..?

కూక‌ట్ ప‌ల్లి నుంచి తెలుగుదేశం పార్టీ త‌రుపున పోటీ చేయ‌నున్న క‌ళ్యాణ్ రామ్..?

116
0
82ac09ed-2d38-4ce1-9d4e-39a0c1cc074c

టీఆర్ఎస్ ని ఓడించే ల‌క్ష్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్ క‌లిసి మ‌హా కూటిమిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌హా కూట‌మి ఈ ఎన్నిక‌ల‌ను చాలా సీరియ‌స్ గా తీసుకుంది. అందుచేత‌నే ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే ఉద్దేశ్యంతో మ‌హా కూటిమి ఎన్టీఆర్ మ‌న‌వ‌డు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, చెన్నారెడ్డి మ‌న‌వ‌డు ఆదిత్య‌రెడ్డిని ఎన్నిక‌ల బ‌రిలో దించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. శేరిలింగంప‌ల్లి లేదా కూక‌ట్ ప‌ల్లి నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, తాండూర్ నుంచి ఆదిత్య రెడ్డి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా, మ‌రో వైపు నిర్మాత‌గా రాణిస్తూ..ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ఏంటి..?  అది కూడా తెలంగాణ‌లో పోటీ చేయ‌డం ఏంటి.? ఇదేదో ఫేక్ న్యూస్ అనుకున్నారు. అయితే..ఈ వార్త ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ ఏబీన్ లో ప్ర‌సారం కావ‌డంతో ఇది నిజ‌మే అనిపిస్తోంది. ఇటీవ‌ల నంద‌మూరి హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత ఆ కుటుంబం నుంచి ఒక‌రికి పార్టీలో కీల‌క స్ధానం క‌ల్పించాల‌ని అథిష్టానం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అందుచేత క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావించి..క‌ళ్యాణ్ రామ్ ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. మ‌రి..వ‌స్తున్న వార్త‌ల పై క‌ళ్యాణ్ రామ్ స్పందిస్తారేమో చూడాలి.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here