Home Actor కృష్ణ‌వంశీ రుద్రాక్ష క‌న్ ఫ‌ర్మ్. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

కృష్ణ‌వంశీ రుద్రాక్ష క‌న్ ఫ‌ర్మ్. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

68
0
కృష్ణ‌వంశీ రుద్రాక్ష క‌న్ ఫ‌ర్మ్. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..? spiceandhra

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే…ఆయ‌న రుద్రాక్ష అనే సినిమా తీయ‌నున్నార‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అఫిషియ‌ల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

తాజా వార్త ఏంటంటే..ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింద‌ట‌. బ్లాక్ బ‌ష్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ ఈ సినిమాని భారీ స్ధాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న కథానాయికల నుంచి ఒకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. హీరోయిన్ క‌న్ ఫ‌ర్మ్ అయితే..  వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. ఈ తరహా కథకి అనుష్క అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనుష్క‌నే ఎంపిక చేస్తారా..?  లేక వేరే హీరోయిన్ సెలెక్ట్ చేస్తారా తెలియాల్సివుంది. చాలా గ్యాప్ త‌ర్వాత కృష్ణవంశీ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. మ‌రి..ఈ మూవీతో కృష్ణ‌వంశీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here