Home Actor కె.ఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ?

కె.ఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ?

51
0
కె.ఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ? spiceandhra

గత కొద్దీ రోజులుగా మీడియాలో కె.ఏ పాల్ బయోపిక్ మీద న్యూస్ హల్ చ‌ల్ చేస్తుంది. క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ ఇందులో కె.ఏ పాల్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఈ ప్రాజెక్ట్ పై ఆస‌క్తి ఏర్ప‌డింది. అస‌లు..ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉందా..?  లేక పుకారేనా..? అని ఆరా తీయ‌డం స్టార్ట్ చేసారు.

అలా…ఆరా తీస్తే…నిజ‌మే అని తెలిసింది. నూతన ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌ నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి తెలిసిన తాజా వార్త ఏంటంటే… ఈ సినిమాని అమెరికాలో కూడా షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తో కూడా కొన్ని సీన్స్ ఉంటాయ‌ట‌.  అందుక‌నే  అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే  పోలికలు వుండే ఆర్టిస్ట్ ని గుర్తించార‌ట‌.  సునీల్ ప్రస్తుతం అమెరికా లో ఉన్నారు.  మెక్ ఓవర్ కోసం సునీల్ హాలీవుడ్  మేక్ అప్ మెన్ ని సంప్రదించార‌ట‌.

 ఈ సినిమా లో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ జామ్ ఉన్ , హాలీవుడ్ స్టార్ నటి  ఏంజెలీనా జోలీ  లాగ వుండే ఆర్టిస్ట్ లు  కూడ నటిస్తున్నట్టుగా తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ నెల 16 త‌ర్వాత సునీల్ ఇండియాకి వ‌స్తార‌ట‌. ఆత‌ర్వాత ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here