Home Movie News కె.జె.ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌..పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌

కె.జె.ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌..పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌

103
0

ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌. ఈ జర్నీలో ఆయన కొన్ని కోట్ల మంది సంగీత ప్రియులను అలరించారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో, మన తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్‌ 11న లైవ్‌ కాన్సర్ట్‌ ప్రోగ్రామ్‌ చేయబోతున్నారు. గతంలో మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్‌, భరత నాట్యం డాన్సర్‌ శోభనతో ప్రోగ్రామ్‌లను నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన సినిమాల్లోని హిట్‌ పాటలను ఈ లైవ్‌ కనసర్ట్‌లో ఏసుదాస్‌ ఆలపించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌ జరగలేదు. తొలిసారి ఇలాంటి సంగీత వేడుక ఏసుదాస్‌ ఆధ్వర్యంలో జరనుండటం ఆయన అభిమానులకే కాదు.. సంగీతాన్ని ప్రేమించే అందరికీ పండగే అని చెప్పవచ్చు. ఏసుదాస్‌తో పాటు ఆయన తనయుడు ప్రముఖ సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ కూడా ఈ లైవ్‌ కాన్సర్ట్‌లో పాల్గొనబోతుండటం విశేషం. ఈ లైవ్‌ కాన్సర్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. నవంబర్‌ 11 రాత్రి ఏడు గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్‌ ధర రూ.1200. ఈ టికెట్స్‌ బుక్‌ మై షో ద్వారా లభ్యమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here