Home Political News కేసీఆర్ ఓ క‌మీనా – రేవంత్ రెడ్డి..!

కేసీఆర్ ఓ క‌మీనా – రేవంత్ రెడ్డి..!

107
0

తెలంగాణ కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి గాజులరామారంలో జరిగిన కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం మైనార్టీ కన్వెన్షన్‌ సభలో పాల్గొన్నారు. ఈ స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్, కేటీఆర్ ల పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజ‌కీయ చావు భ‌యం ప‌ట్టుకుంది. అమ‌రావ‌తికి వెళ్లిన చంద్ర‌బాబుతో తెలంగాణ‌కు ముప్పులేదు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు బాబు మ‌ద్ద‌తు ఇస్తున్నారు అని తెలియ‌చేసారు.  ప్ర‌తి ఇంటికి ఒక్క‌రిని 60 రోజులు మాకు ఇవ్వండి. 60 నెల‌లు మీకోసం ప‌ని చేస్తాం అన్నారు.

63 సీట్లు గెలిస్తే..ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ కొని 100కి చేసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ 100 మందిని ఎందుకు గెలిపించాలి అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను తిట్టిన కేసీఆర్ ఓ క‌మీనా అని… అండ‌మాన్ జైలులో పెట్టాల్సిన బాధ్య‌త పోలీసుల‌కు లేదా అని అడిగారు. తెలంగాణ సెంటిమెంట్ ను ర‌గిల్చేందుకు చంద్ర‌బాబును కేసీఆర్ తెర మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అన్నారు. కేసీఆర్ పీడ విర‌గ‌డ కోస‌మే కాంగ్రెస్ కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. మెడీ జీత‌గాడు కేసీఆర్ పాలించాలో..లేదా రాహుల్ మ‌నిషి పాలించాలో ప్ర‌జ‌లు తేల్చుకోవాల‌న్నారు.

తెలంగాణ కోసం పార్ల‌మెంట్ లో పోరాటం చేసిన‌ప్పుడు కేసీఆర్ లేడు అన్నారు. డైన‌మిక్ యువ నేత రేవంత్ అంటే కేసీఆర్ కు భ‌యం. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని విచ్చ‌ల‌విడిగా దోచుకుంద‌ని ఆరోపించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here