Home Political News కేసీఆర్ కి కొత్త నిర్వ‌చ‌నం చెప్పిన  కేటీఆర్..!

కేసీఆర్ కి కొత్త నిర్వ‌చ‌నం చెప్పిన  కేటీఆర్..!

112
0

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  కామారెడ్డిలో నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడుతూ…తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆత్మగౌరవం లేదనీ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పదవులను గద్దల్లా పట్టుకుని వేలాడారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలది అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు అంత సులభంగా ఇవ్వలేదనీ, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే వీపు చింతపండు అవుతుందని ప్రజలు హెచ్చరించడంతో తెలంగాణ వచ్చిందని తెలియ‌చేసారు.

ఈ స‌భ‌లో కేసీఆర్ అంటే ఏమిటో కొత్త నిర్వ‌చనం చెప్పారు. ఇంత‌కీ కేటీఆర్ ఏం చెప్పారంటే…కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదనీ, కే-అంటే కాలువలు, సీ-అంటే చెరువులు, ఆర్-అంటే రిజర్వాయర్లని కొత్త నిర్వచనం ఇచ్చారు. కేసీఆర్ మోదీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ చెబుతున్నారనీ, ఇప్పుడు మోదీ జపాన్ లో ఉన్న విషయం కూడా తెలియని తెలివితక్కువ దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ఇవ్వలేదని, ప్రజలే గుంజుకున్నారని కేటీఆర్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here