Home Political News కేసీఆర్ కు ఎన్నిక‌ల భ‌యం ప‌ట్టుకుంది – ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

కేసీఆర్ కు ఎన్నిక‌ల భ‌యం ప‌ట్టుకుంది – ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

98
0

కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై ఘాటుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతో తెలుగుదేశం నేత‌లు కేసీఆర్ పై మండిప‌డుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో భయం ఎక్కువవుతోందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీల పై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి కేసీఆర్ వరకు అందరూ చంద్రబాబుకు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును తిడితే ఓట్లు పడతాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని… కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ‌లో టీడీపీ లేద‌న్నారు. మ‌రి..ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని అడిగారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పిన కేటీఆర్ వ్యాఖ్యలను కేసీఆర్ మరిచిపోయారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ వల్లే కేసీఆర్ ఒక రాజకీయ నేతగా ఎదిగారని… ఆయన మంత్రివర్గంలో ఉన్న సగం మంది టీడీపీ వాళ్లేనని… ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందనే నిజాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here