Home Political News కేసీఆర్ కు ఎవ‌రెవ‌రు కోవ‌ర్టులుగా ఉన్నారో బ‌య‌ట‌పెడ‌తా – వీ.హెచ్..!

కేసీఆర్ కు ఎవ‌రెవ‌రు కోవ‌ర్టులుగా ఉన్నారో బ‌య‌ట‌పెడ‌తా – వీ.హెచ్..!

97
0
New-Secretariat-in-Telangana--Voting-to-decide--1506336674-1554

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్ర‌చార, మేనిఫెస్టో క‌మిటీల్లో స్ధానం ద‌క్క‌క‌పోవ‌డంతో కొంద‌రు నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క‌మీటీలో స్ధానం ద‌క్క‌క‌పోవ‌డం పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు స్పందిస్తూ…ప్ర‌చార క‌మిటీ నుంచి ప‌క్క‌న పెట్ట‌డం కంటే చంచ‌ల్ గూడ జైలులో పెడితే బాగుండేదంటూ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసారు. ప్ర‌చార వాహ‌నం కూడా సిద్ధం చేసుకున్నానని…కానీ..ప్ర‌చార క‌మిటీలో స్ధానం ద‌క్క‌క‌పోవ‌డం బాధ క‌లిగించింద‌న్నారు.  1989లో ప్ర‌చార క‌మిటీ ఛైర్మెన్ గా పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చానన్నారు.

పార్టీలో కొంత మంది కోవ‌ర్ట్ లు ఉన్నారని… కేసీఆర్ అబ‌ద్ధాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని… కేసీఆర్ తో కొంద‌రికి ర‌హ‌స్య ఒప్పందం ఉందని ఆరోపించారు.  త‌న‌కి ప‌ద‌వి ఇస్తే కేటీఆర్ ను ఓడిస్తాన‌ని వాళ్ల భ‌యం. కేసీఆర్ కు ఎవ‌రెవ‌రు కోవ‌ర్టులుగా ఉన్నారో బ‌య‌ట‌పెడ‌తా అంటూ వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ని క‌లిసి వీహెచ్ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here