Home Political News కేసీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ తొత్తులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. – వి.హ‌నుమంత‌రావు

కేసీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ తొత్తులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. – వి.హ‌నుమంత‌రావు

109
0
V-Hanumantha-Rao-fires-on-KCR-over-Rahul-Gandhis-tour

తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో రోజురోజుకు రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతుంది. కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయ‌డం..అది కూడా ఇంట్లో ఎవ‌రూ లేక‌పోతే త‌లుపు తాళాలు బ‌ద్ద‌ల గొట్టి మ‌రీ ఐటీ అధికారులు సోదాలు చేయ‌డం పై కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపే అంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని..అది చూడ‌లేకే కేసీఆర్ ఇలా చేస్తున్నారంటున్నారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు స్పందిస్తూ…రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నట్టుగా లేదని విమర్శించారు.  అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తే వేలకోట్లు దొరుకుతాయని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు రాజకీయ కక్ష సాధింపేనని వీహెచ్‌ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తప్పదని హెచ్చ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here