Home Political News కేసీఆర్ కు ప్ర‌జా కోర్టులో శిక్ష‌ప‌డేలా చేస్తాం – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

కేసీఆర్ కు ప్ర‌జా కోర్టులో శిక్ష‌ప‌డేలా చేస్తాం – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

88
0

కేసీఆర్ నిజ‌మాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మ‌హా కూటమి పై మండిప‌డ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల పై టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ స్పందిస్తూ…తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం ఏంటీ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి..2009లో తెలుగుదేశం పార్టీతో తెరాస పొత్తు పెట్టుకోలేదా..?  అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ధ‌నిక రాష్ట్ర‌మైన తెలంగాణ‌ను అప్పుల పాలు చేసార‌న్నారు.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో కేసీఆర్ కుటుంబం విలాసవంత‌మైన జీవితం గ‌డుపుతుంది అన్నారు. తెలంగాణ ఇచ్చాకా సోనియా గాంధీ వ‌ద్ద‌కు వెళ్లి కృత‌జ్ఞత‌లు తెల‌ప‌లేదా..? ప‌్ర‌జాధ‌నం ప్ర‌తి ఒక్కరికీ అందించాల‌నే మ‌హా కూట‌మికి శ్రీకారం చుట్టాం అని చెప్పారు. కొంగ‌ర‌క‌లాన్ స‌భ‌తో కేసీఆర్ డీలాప‌డ్డారు.  అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంది క‌నుక కేసీఆర్ బూతు మాట‌లు అందుకున్నారు.  న‌రేంద్ర మోడీతో క‌లిసి ఎన్ని కుట్ర‌లు చేసినా ఫ‌లించ‌వు అని… కేసీఆర్ ఎంగిలి మెతుకుల‌కు ఎప్పుడూ ఆశ‌ప‌డ‌లేద‌ని..చెప్పారు. చంద్ర‌బాబు వ‌ల్లే తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఉంద‌ని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here