Home Political News కేసీఆర్ కు మైండ్ పోయింది – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

కేసీఆర్ కు మైండ్ పోయింది – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

95
0

ఎన్టీఆర్ భ‌వ‌న్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశానికి టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, రేవూరి, శోభారాణి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక పై చ‌ర్చించారు. ఈ నెల 22న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ను విడుద‌ల చేయ‌నున్నారు. టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మాట్లాడుతూ… కేసీఆర్ కు మైండ్ పోయింది. ఐదేళ్ల‌లో ఖ‌ర్చు పెట్టిన 8 ల‌క్ష‌ల కోట్లు ఎవ‌రి జేబులోకి వెళ్లాయి. మ‌హాకూట‌మి మ్యానిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు. 50 రోజుల్లో 100 స‌భ‌ల‌ని చెప్పిన కేసీఆర్ 4 స‌భ‌ల‌కే  ఔట‌య్యాడు అన్నారు. ఏపీలో తుఫాన్ వ‌స్తే చంద్ర‌బాబు అక్క‌డికి వెళ్లారు. కొండ‌గ‌ట్టు ప్ర‌మాదం జ‌రిగితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప‌డుకున్నారు అన్నారు.

టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ…ఈ నెల 22న మ్యానిఫెస్టోను విడుద‌ల చేస్తాం. చంద్ర‌బాబును తిడితే ఓట్లు రాల‌తాయ‌నే భ్ర‌మ‌లో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు అన‌డానికి నిన్న‌టి మ్యానిఫెస్టోనే నిద‌ర్శ‌నం అని చెప్పారు. నిరుద్యోగ భృతి పై ఆగ‌ష్టు 13న అవ‌హేళ‌న చేసారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు క‌ట్ట‌కుండా ప్ర‌తిప‌క్షాలు అడ్డుకున్నాయా…?  నాలుగేళ్ల‌లో ఏం చేసాడో చెప్ప‌కుండా చంద్ర‌బాబును తిడుతున్నాడు. కేసీఆర్…ఎప్పుడు ఎవ‌ర్ని తిడ‌తాడో తెలియ‌దు. రేపు ప్ర‌జ‌ల‌ను కూడా తిడ‌తాడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here