Home Political News కేసీఆర్ ది దొంగ బ‌తుకు – దొంగ పాస్ పోర్టుల చ‌రిత్ర – టీటీడీపీ అధ్య‌క్షుడు...

కేసీఆర్ ది దొంగ బ‌తుకు – దొంగ పాస్ పోర్టుల చ‌రిత్ర – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

93
0

కేసీఆర్ నిజ‌మాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు పై తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డంతో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులు కేసీఆర్ పై మండిప‌డుతున్నారు. టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ స్పందిస్తూ..అర్ధాంత‌రంగా అసెంబ్లీ ర‌ద్దుతో కేసీఆర్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కొంగ‌ర‌క‌లాన్ స‌భ త‌ర్వాత కేసీఆర్ లో నిరుత్సాహం, అస‌హ‌నం పెరిగింద‌న్నారు. కేసీఆర్ మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు.

కేసీఆర్ ది దొంగ బ‌తుకు, దొంగ పాస్ పోర్టుల చ‌రిత్ర… మేం కూడా ఇష్టానుసారంగా మాట్లాడ‌గ‌లం. కానీ..మాకు సంస్కారం ఉంద‌న్నారు.తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు. మోడీతో క‌లిసి కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నారు. కేసీఆర్ కు ఓటు వేస్తే..బీజేపీకి ఓటు వేసిన‌ట్టే అన్నారు. సోనియాను కేసీఆర్ దేవ‌త అని అన‌లేదా..? అని అడిగారు. చంద్ర‌బాబు వ‌ల్లే రాష్ట్ర ఆదాయం పెరిగింద‌ని గ‌తంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌భ‌లో చెప్ప‌లేదా అని కేసీఆర్ ని  ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు సృష్టించిన సంప‌ద‌తోనే కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కులుకుతున్నారు అని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here