Home Political News కేసీఆర్ దుర‌హంకారానికి చ‌ర‌మ‌గీతం… – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

కేసీఆర్ దుర‌హంకారానికి చ‌ర‌మ‌గీతం… – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

91
0
pp_6568

తెలంగాణ‌లో ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారంలో స్పీడు పెంచారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు మ‌హాకూట‌మి ఓ ప్లాన్ ప్ర‌కారం వెళుతుంది. త్వ‌ర‌లోనే ఈ కూట‌మి అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈరోజు జ‌గిత్యాల‌లో మ‌హా కూట‌మి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మాట్లాడుతూ…నాలుగేళ్ల‌లో కేసీఆర్ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు.

ప్ర‌చారం కోసం కేసీఆర్ కుటుంబం హెలికాఫ్ట‌ర్ల‌లో తిరుగుతోంది. కొండ‌గ‌ట్టు ప్ర‌మాదంలో చ‌నిపోయిన కుటుంబాల‌ను, తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్న వాళ్ల‌ను మాత్రం ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. అస‌లు వాళ్ళ గురించి ప‌ట్టించుకోలేదు. క‌ల్వ‌కుంట్ల నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పించ‌డం కోస‌మే ఈ కూట‌మి ఏర్పాటు చేసాం. కోట్లు ఖ‌ర్చు పెట్టి స‌భ‌లు నిర్వ‌హించినా…జ‌నం రావ‌ట్లేదు అన్నారు. కేసీఆర్ దుర‌హంకారానికి చ‌ర‌మ‌గీతం పాడేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు. జగిత్యాల నుంచే మ‌హా కూట‌మి జైత్ర‌యాత్ర ప్రారంభ‌మౌతుంది అని చెప్పారు.

మా కూట‌మికి సీట్లు, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు లేవు. ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఏక‌మ‌య్యాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్న‌కలే దేశానికి దిక్సూచి అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here