Home Political News కేసీఆర్ ను చూస్తుంటే జాలేస్తుంది – కాంగ్రెస్ నేత డీకే అరుణ

కేసీఆర్ ను చూస్తుంటే జాలేస్తుంది – కాంగ్రెస్ నేత డీకే అరుణ

113
0
image_710x400xt

కేసీఆర్ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలో కొత్త‌ద‌నం లేదు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను వినిపించినందుకు కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు అన్నారు కాంగ్రెస్ నేత మ‌ధుయాస్కీ. మా హామీలు నెర‌వేర‌తాయ‌ని..ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. రుణ మాఫీ పై కేసీఆర్ హామీల‌ను రైతులు న‌మ్మేప‌రిస్ధితుల్లో లేరు. ప్ర‌జా ఫ్రంట్ గెలుపును టీఆర్ఎస్ ఆప‌లేద‌న్నారు.

కాంగ్రెస్ నేత డీకే అరుణ మాట్లాడుతూ…కాంగ్రెస్ ఇచ్చిన హ‌మీలు జ‌నంలోకి వెళ్లాయ‌ని కేసీఆర్ భ‌యం. ఇప్పుడు కేసీఆర్ చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు. కేటీఆర్ అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను చూస్తుంటే జాలేస్తుంది. ఒక్క‌సారి అధికారం ఇచ్చి ప్ర‌జ‌లు మీ రుణం తీర్చుకున్నారు. కానీ..మీరు ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేదు. టీఆర్ఎస్ నుంచి రావ‌డానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మా మ్యానిఫెస్టో ఎలా పెట్టాలో కేసీఆర్ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here