Home Political News కేసీఆర్ న‌న్ను బెదిరించారు నాకు ర‌క్ష‌ణ క‌ల్పించండి – కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

కేసీఆర్ న‌న్ను బెదిరించారు నాకు ర‌క్ష‌ణ క‌ల్పించండి – కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

94
0

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి…ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పై తనకు నమ్మకం లేదని… అందుకే తనకు రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర సెక్యూరిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ లో గతంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ శిక్షణలో ఆయన పాల్గొన్నారని.. అందుకే ఆయన పై నమ్మకం లేదని చెప్పారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ న‌న్ను బెదిరించారు. తనను భౌతికంగా లేకుండా చేస్తామ‌ని టీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు హెచ్చరించారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారంటూ నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ తెలిపారు. దీన్ని సుమోటాగా తీసుకోవాలని లేదా తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని కోరానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here