Home Political News  కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

126
0
Revanth-Reddy-1

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఇటీవ‌ల ఐటీ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. బ‌స్వాపురంలో రేవంత్ రెడ్డి రోడ్డు షో లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ ఆలీ త‌రుపు ప్ర‌చారం చేసారు. ఈ రోడ్డు లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ పేద ప్ర‌జ‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు క‌ట్టించ‌లేదు కానీ…ఆయ‌న మాత్రం 300 కోట్ల‌తో ఇల్లు క‌ట్టుకున్నారు. కామారెడ్డిలో గంపా గోవ‌ర్ధ‌న్ కు ఓటు వేస్తే..గ‌జ దొంగ‌కు ఓటు వేసిన‌ట్టే అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే..ఎమ్మెల్యేలు నియోజ‌క వ‌ర్గాల‌ను దోచుకుంటున్నారు అన్నారు.

ఎమ్మెల్యే గంప గోవ‌ర్థ‌న్ ఎప్పుడైనా ప్ర‌జా స‌మ‌స్య‌ల పై అసెంబ్లీలో మాట్లాడారా..?  అని ప్ర‌శ్నించారు. గంప తన తట్టాబుట్టా సర్దుకునే సమయం దగ్గరపడిందని అన్నారు.వీళ్ల వ్యవస్థ అంతా అడవిపందుల వ్యవస్థ. చెరకు తోటల మీద అడవిపందులు పడితే.. తిన్నకాడికి తిని, ఉన్నదంతా తొక్కి సర్వనాశనం చేసిపోతాయి. చెరకుతోటల మీద అడవి పందులు పడ్డట్టు రాష్ట్రం పై టీఆర్ఎస్ నాయకులు పడ్డారు. తిన్నకాడికి తిని.. దోచిన కాడికి దోచి.. మిగిలినదంతా ఎవ్వరికీ అక్కరకు రాకుండా సర్వనాశనం చేసి పోవడానికి కంకణం కట్టుకుని ఉన్నారు అంటూ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు.

మన భవిష్యత్ తరాల కోసం తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? టీఆర్ఎస్ నాయకులకు కరెంట్ షాక్ కొట్టించాల్సిన అవసరం ఉందా? లేదా? మన కరెంట్ ఓటు. ఆ ఓటు ను చెయ్యి గుర్తు మీద వేసి మీరు మమ్మల్ని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here