Home Political News కేసీఆర్ మ‌తిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు – డీకే అరుణ‌

కేసీఆర్ మ‌తిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు – డీకే అరుణ‌

103
0

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల మాట్లాడుతూ…కాంగ్రెస్ నాయకుల పై మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు డీకే అరుణ‌ గురించి మాట్లాడుతూ…నీ బండారం బ‌య‌ట‌పెడ‌తాను. ఇంటింటికి వెళ్లి నీ బండారం గురించి చెబుతామంటూ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందిస్తూ…కేసీఆర్ మ‌తిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. పాల‌మూరు జిల్లాకు నీరు ఇచ్చామ‌ని చెప్పుకునేందుకు సిగ్గు ఉండాలి అన్నారు.

కేసీఆర్ ఎంత మోస‌గాడో ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది. కేసీఆర్ సంస్కారంతో మాట్లాడ‌డం నేర్చుకోవాలి అన్నారు. పాల‌మూరు జిల్లాకు కేసీఆర్ ఏం ఒర‌గ‌బెట్టారు అని ప్ర‌శ్నించారు. ఓ శ‌క్తి గురించి మాట్లాడుతున్నావ‌ని గుర్తించుకో అన్నారు. కేసీఆర్ కు ద‌మ్ముంటే ర‌ఘ‌వీరారెడ్డికి నేను ప‌ట్టిన మంగ‌ళ‌హార‌తి ఫోటో లేదా వీడియో చూపించాలి అంటూ స‌వాల్ విసిరారు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తెలంగాణ‌కు ఏం చేసావు అని కేసీఆర్ ని ప్ర‌శ్నించారు. దుబాయ్ కు దొంగ పాస్ పోర్టుల‌తో వ్యాపారం చేసిన ఘ‌న‌త కేసీఆర్ దే అని తెలియ‌చేసారు.

దుబాయ్ శేఖ‌ర్ గా కేసీఆర్ ప్ర‌సిద్ధ‌ని అంద‌రికీ తెలుసు. గ‌ద్వాల‌లో ప్ర‌తి ఇంట్లో నా ఫోటో ఉంది. నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు అన్నారు. కేసీఆర్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవారు ఎవ‌రూ లేరు. తెలంగాణ‌లో పుట్టిన నీకు ఇంత నీచ సంస్కృతి ఎలా వ‌చ్చింది. నాలుగున్న‌రేళ్ల‌లో నా బండారం ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయావు అని ప్ర‌శ్నించారు. నా గురించి గ‌ద్వాల్ ప్ర‌జ‌ల‌కు తెలుసు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక నాపై కేసీఆర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. నా ఒళ్లు నా ద‌గ్గ‌రే ఉంది కేసీఆర్… నీ ఒళ్లే నీ ద‌గ్గ‌ర లేదు అని చెప్పారు. తెలంగాణ మ‌హిళ‌కు ద్రోహం చేసింది కేసీఆరే. ముఖ్య‌మంత్రి స్ధాయిలో ఉన్న ఎలా మాట్లాడాలో తెలుసుకో అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here