Home Actor కే.ఏ పాల్ పాత్ర‌లో సునీల్. ఇది నిజ‌మా..?

కే.ఏ పాల్ పాత్ర‌లో సునీల్. ఇది నిజ‌మా..?

110
0
కే.ఏ పాల్ పాత్ర‌లో సునీల్. ఇది నిజ‌మా..? spiceandhra

కే.ఏ పాల్ ఈ పేరు వింటే..ఎవ‌రైనా స‌రే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. ఎందుకంటే.. ఆయ‌న మాట్లాడే మాట‌లు అలా ఉంటాయి కాబ‌ట్టి. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న చేసిన హాడావిడి అంతా ఇంతా కాదు. ఇత‌ర పార్టీల పై కామెంట్ చేస్తూ.. త‌న పార్టీ గురించి చెబుతూ ఎంత కామెడీ చేసారో అంద‌రికీ తెల్సిందే. అయితే…కే.ఏ పాల్ చేసిన కామెడీ చూసి బాగా ఇన్ స్పైర్ అయిన‌ట్టున్నారు ఓ డైరెక్ట‌ర్. ఏకంగా ఆయ‌న పై సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై ఆరా తీస్తే.. నిజ‌మే అని తెలిసింది.  అవును.. ఇది నిజంగా నిజం. కే.ఏ పాల్ పాత్ర‌ను క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌. సునీల్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేస్తార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తుంది.

ఇంత‌కీ ఇది ఏ త‌ర‌హా చిత్రం అంటారా..?  పొలిటిక‌ల్ డ్రామా అట‌. అయితే… ఇందులో కావాల్సినంత వినోదం ఉంటుంద‌ట‌. కే.ఏ పాల్ ను త‌లుచుకుంటేనే న‌వ్వు వ‌చ్చేస్తుంటుంది. ఇలాంటి పాత్ర‌ను సునీల్ పోషిస్తే… ఇక వినోదం ఓ రేంజ్ లో ఉండ‌డం ఖాయం. ఆల్రెడీ న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంద‌ట‌. మ‌రి… త‌న గురించి సినిమా వ‌స్తుంది అంటే కే.ఏ పాల్ పాజిటివ్ గా తీసుకుంటారో..?  లేక నెగిటివ్ గా తీసుకుంటారో..?  ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here