Home Political News కొంద‌రు పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా ప‌ని చేస్తున్నారు – కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.

కొంద‌రు పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా ప‌ని చేస్తున్నారు – కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.

119
0

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజ‌కీయ పార్టీలు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ..మా వ‌ల్లే అభివృద్ది సాధ్యం అంటే కాదు మా వ‌ల్లే అభివృద్ది సాధ్యం అంటూ ప్ర‌చారం చేస్తూ ఒట‌ర్లను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ కు మ‌హాకూట‌మి గ‌ట్టి పోటీనే ఇస్తుంది అనిపిస్తుంది.  తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాట్లాడుతూ..టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.

కొంద‌రు పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా ప‌ని చేస్తున్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చాకా మా ప‌ని మేం చేస్తాం అని చెప్పారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను టీఆర్ఎస్ నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డానికి వాడుకుంటున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ ఎంపీ సంతోష్ కుమార్ నివాసంలో త‌నిఖీలు చేయాల‌ని సీఈవో ర‌జ‌క్ కుమార్ కు ఫిర్యాదు చేసాం అని తెలియ‌చేసారు. మొన్న గ‌చ్చిబౌలిలో జ‌రిగిన సెన్సేష‌న్ ఈవెంట్ లో జోరుగా మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారం జ‌రిగింది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here