Home Political News కొడుకో, కూతురినో సీఎం చేయ‌డానికే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు – బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా

కొడుకో, కూతురినో సీఎం చేయ‌డానికే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు – బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా

133
0

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ…తెలంగాణ‌లో బీజేపీ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌బోతోంది. 11 కోట్ల మంది స‌భ్యుల‌తో ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ. 15 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నారు అని తెలియ‌చేసారు. ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఒరిస్సాలో గెలిస్తే నే సంపూర్ణ విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంది. ఓవైసీ కోస‌మే కేసీఆర్ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం లేదు. కొడుకో, కూతురినో సీఎం చేయ‌డానికే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు తెచ్చారన్నారు.

కేసీఆర్ ఆశ‌లు నెర‌వేర‌వు. ముంద‌స్తు ఎన్నికల‌తో ప్ర‌జ‌ల పై భారం మోపారు అని చెప్పారు. ఆయ‌న‌ రాహుల్ కాదు. ఆయ‌న రాహుల్ బాబా అని విమ‌ర్శించారు. భాజాపాను అడ్డుకునేందుకు రాహుల్ బాబా అండ్ కంపెనీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ..వారి ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌వు అన్నారు. కేసీఆర్..వాస్త‌వాలు మాట్లాడు. తెలంగాణ పై మోడీ వివ‌క్ష చూపుతున్నారంటూ అబ‌ద్దాలు చెబుతున్నారు. నాలుగున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌కు కేంద్రం ఇచ్చిన 1.15 ల‌క్ష‌ల కోట్ల సంగ‌తి మరిచారా..? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో ర‌హ‌దారుల‌కే 40 వేల కోట్ల‌కు పైగా నిధులిచ్చాం అని గుర్తు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here