Home Telugu కొత్త ద‌ర్శ‌కుడికితో తేజు సినిమా..!

కొత్త ద‌ర్శ‌కుడికితో తేజు సినిమా..!

135
0
Sai-Dharam-Tej-movie with new director

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ ప్రారంభంలో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్..ఇలా  వ‌రుస విజ‌యాలు సాధించినా…ఇటీవ‌ల కాలంలో చేసిన తిక్క‌, విన్న‌ర్, జవాన్, ఇంటిలిజంట్, తేజ్ సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తో చేసిన ఇంటిలిజెంట్, క‌రుణాక‌ర‌న్ తో చేసిన తేజ్ సినిమాల పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ..స‌క్స‌స్ మాత్రం రాలేదు.  దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ తేజు ఈసారి కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడ‌ట‌.

ఇటీవ‌ల గోపాల్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ తేజుకి బాగా న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. ఈ చిత్రానికి భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాని ఠాగూర్ మ‌ధు నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేయ‌నున్నారు.  మ‌రి..ఈ సినిమా అయినా తేజ్ కి విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here