Home Telugu కొర‌టాల నెక్ట్స్ మూవీ హీరో ఇత‌నే..!

కొర‌టాల నెక్ట్స్ మూవీ హీరో ఇత‌నే..!

97
0

బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌…భ‌ర‌త్ అనే నేను సినిమాతో మ‌రోసారి సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. ఈ సినిమా 205 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి రాబోయే సినిమాల‌కు టార్గెట్ ఫిక్స్ చేసింది. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను…ఇలా వ‌రుస‌గా నాలుగు బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించ‌డంతో డైరెక్ట‌ర్ కొర‌టాల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంద‌ని కొర‌టాల‌ని అడిగితే…ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను స‌క్స‌స్ ఎంజాయ్ చేస్తున్నాను. నెక్ట్స్ మూవీ గురించి ఇంకా ఏమీ అనుకోలేద‌ని చెప్పారు.

అయితే…కొర‌టాల నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్ తో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత బ‌న్నీతో కాదు..మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల సినిమా ఫిక్స్ అంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుంది అని కూడా టాక్ వినిపించింది. ఇదే విష‌యం గురించి నాని అడిగితే…అస‌లు కొర‌టాల‌ను క‌ల‌వ‌లేదు. ఎప్పుడో ఒక‌సారి క‌లిసానంతే. అయినా..మా మ‌ధ్య సినిమాకి సంబంధించిన టాపిక్కే రాలేద‌ని చెప్పాడు.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే…చిరంజీవి ప్ర‌స్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న‌తో సినిమా చేయాలంటే టైమ్ ప‌డుతుంది. అందుచేత ఈలోపు నానితో సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట. ఇటీవ‌ల కొర‌టాల నానిని క‌లిసి క‌థ చెప్ప‌డం..క‌థ విని నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొర‌టాల ఫ్రెండ్ సుధాక‌ర్ ఈ సినిమాకి నిర్మాత అని…త్వ‌ర‌లోనే ఈ మూవీ గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త గురించి నాని స్పందిస్తాడేమో చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here